Profile photo for ఏకా కి
ఏకా కి

స్త్రీ స్థనాలని లాగిపట్టుకోవడం,
కట్టుకున్న పైజామా తాడుని తెంపేయడం..
రేప్ చేయడానికి ప్రయత్నించడం కిందికిరావని
11ఏళ్ల చిన్నపిల్ల మీద జరిగిన అత్యాచార కేసులో
గౌరవ న్యాయమూర్తి పోక్సో చట్టానికి అర్ధం చెప్పారు.

ఫోక్సో చట్టం ఎంత కఠినంగ ఉంటుందో కోర్ట్ సినిమాలో చూపించారు మైనర్ బాలికను మేజర్ (ఆమెకంటే ఒక్కరోజు పెద్దవాడైన) మేజర్ అబ్బాయి ఇంటికి తీసుకుపోయినా రేప్ చేయడం కిందికి వస్తుందని ఫోక్సో చట్టం చాలా కటినంగ ఉంది.

న్యాయ మూర్తులు స్త్రీలకోసం కొత్త చట్టాలు చేయకపోయినా పర్వాలేదు ఉన్న చట్చాలను మార్చి ఇంత దిగజారుడు తీర్పులు ఇవ్వడం ఆడపిల్లల తల్లిదండ్రులకు భయాలను కలిగిస్తుంది.

ఇలాంటి ఘోరాలను మా లాంటి వాళ్లు ప్రశ్నిస్తుంటే మత జాంభీలు మా ఇంటి స్త్రీలను తల్లి పెళ్లాం కూతుళ్లను కూడ వదలకుండ రోతకలిగించే మాటలతో దాడీ చేస్తున్నారు. ఇలాంటి కోర్ట్ తీర్పు మీ ఆడపిల్లలపై ఇస్తే మీకు ఆనందమేనా ఎందుకంటే ఆ న్యాయమూర్తులు మన సంస్కృతి కాపాడే మహానుబావులేగ.!!


</div>