*నేడు రాష్ట్రపతి భవన్‌లో మ్రోగనున్న మంగళవాయిద్యాలు*
*సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహానికి వేదిక కానున్న రాష్ట్రపతి భవన్. బీహార్లోని సున్నితమైన నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో.. నక్సల్స్‌ని అణచివేయడంలో కీలకపాత్ర పోషించిన పూనం గుప్తా.. ఆ తర్వాత ద్రౌపది ముర్ము గారి భద్రతా విభాగంలో చేరి నిరుపమానమైన సేవలు అందజేస్తున్నారు. ఆమె సేవలకు ముగ్ధురాలైన ముర్ము గారు ఆమె వివాహాన్ని దగ్గరుండి చేయాలని తలపెట్టారు. అందుకు రాష్ట్రపతి భవన్ ను వేదికగా వినియోగించుకోవడానికి అనుమతిచ్చారు రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న మొట్టమొదటి పెళ్ళి ఇదే*